Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనా 'సైలెంట్' అస్త్రం.. అమెరికా యుద్ధ విమానాలకు చెక్!

F 35 Fighter Jet Chinas rare earth dominance threatens US
Advertisement
  • ఎఫ్-35 విమానాల తయారీకి చైనా ఖనిజాలే ప్రాణాధారం
  • ఎగుమతులపై చైనా ఆంక్షలతో అమెరికాలో టెన్షన్
  • ఒక్క బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యాన్ని దెబ్బతీసే ప్లాన్
  • 90 శాతం ప్రాసెసింగ్ సామర్థ్యం చైనా గుప్పిట్లోనే
  • ప్రత్యామ్నాయ మార్గాల కోసం అమెరికా పాట్లు
Advertisement
అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎఫ్-35 యుద్ధ విమానాల భవిష్యత్తు ఇప్పుడు చైనా చేతుల్లో చిక్కుకుంది. యుద్ధ విమానాల తయారీకి వాడే 'రేర్ ఎర్త్' మూలకాలపై చైనా తన పట్టును మరింత బిగించడమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరాలో చైనా గుత్తాధిపత్యం చలాయిస్తోంది. తాజాగా ఎగుమతి నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా అమెరికా రక్షణ రంగానికి చైనా 'చెక్' పెట్టినట్లయింది.

ఒక్కో ఎఫ్-35 యుద్ధ విమానంలో దాదాపు 435 కిలోల రేర్ ఎర్త్ మూలకాలను ఉపయోగిస్తారు. విమానంలోని ఇంజన్లు, రాడార్ వ్యవస్థలు, సెన్సార్ల తయారీలో ఇవి అత్యంత కీలకం. ఈ ఖనిజాల శుద్ధి ప్రక్రియలో 90 శాతానికి పైగా వాటా చైనాదే. ఒకవేళ చైనా ఈ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

గతంలో కేవలం ఖనిజాల ఎగుమతులపై మాత్రమే ఆంక్షలు విధించిన చైనా, ఇప్పుడు వాటిని ప్రాసెస్ చేసే సాంకేతికతను కూడా ఇతరులకు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. విదేశీ కంపెనీలు ఈ ఖనిజాలను పొందాలంటే చైనా ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా రక్షణ రంగానికి అనుబంధంగా ఉన్న కంపెనీలకు ఈ లైసెన్సులు నిరాకరించడం ద్వారా, అమెరికా సైనిక సామర్థ్యాన్ని చైనా దెబ్బతీస్తోంది. ఇప్పటికే 100కు పైగా ఎఫ్-35 విమానాల డెలివరీ ఈ కారణంతోనే ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
F-35 Fighter Jet
China rare earth elements
US defense
rare earth minerals
military technology
trade war
export restrictions
supply chain
national security
geopolitics

More Telugu News